అధిక ఫీజులపై విద్యార్ధి సంఘాల నిరసన - ananthapuram
ప్రైవేటు విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. సమాచారం అందుకున్న పోలీసులు వారిని బలవంతంగా బయటికి పంపేశారు. ఆగ్రహించిన విద్యార్థి సంఘాలు విద్యా సంస్థ ముందు బైఠాయించి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు.
అధిక ఫీజుల పై విద్యార్ధి సంఘాల నిరశన
ప్రైవేటు విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చైతన్య పాఠశాల ముందు వాగ్వాదానికి దిగారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ పేద కుటుంబాలను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నాయని నిరసన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని బలవంతంగా బయటికి పంపేశారు. ఆగ్రహించిన విద్యార్థి సంఘాలు, విద్యా సంస్థ ముందు బైఠాయించి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు.