బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్న జేసీ తరఫు న్యాయవాదులు - జేసీ ప్రభాకర్ రెడ్డి లేటెస్ట్ న్యూస్
వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో అరెస్టైన జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి తరఫున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేయనున్నారు.
![బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్న జేసీ తరఫు న్యాయవాదులు jc diwakarreddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7619921-335-7619921-1592191848126.jpg)
బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్న జేసీ తరఫు న్యాయవాదులు
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డి తరఫున న్యాయవాదులు నేడు అనంతపురం కోర్టులో బెయిల్ పిటిషన్ వేయనున్నారు. ఈ-ఫైలింగ్ ద్వారా పిటిషన్ దాఖలు చేయనున్నారు. బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేయించారన్న అభియోగాలపై అరెస్టయిన ఇద్దరికీ కోర్టు 14రోజులు రిమాండ్ విధించింది. అనంతరం కడప జైలుకు పోలీసులు తరలించారు.