Adventure of Priest : అనంతపురం జిల్లా బెళుగుప్ప తండాలో గత మూడు రోజుల నుంచి మారెమ్మ అమ్మవారి జాతర ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ పూజారి చేసిన సాహసం అక్కడున్నవారిని ఆకట్టుకుంది. కుప్పగా పేర్చిన ముళ్లకంపలపై నడుచుకుంటూ వెళ్లడం, అక్కడే పడుకోవడం వంటి సాహసాలు చేశాడు. అది చూసిన భక్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు.
అనంతపురంలో వింత ఆచారం.. ముళ్లపై నడుస్తూ పూజారి సాహసం - priest walking on thorns
Priest Adventure : సాధారణంగా మనకు ఒక ముళ్లు కుచ్చుకుంటేనే విలవిల్లాడతాం. అలాంటిది ఓ గ్రామంలో నిర్వహించిన అమ్మవారి జాతరలో ఓ పూజారి చేసిన సాహసం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ముళ్ల కంపలపై నడుస్తూ.. దానిపైనే పడుకుంటూ సాహసం చేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. ఈ ఆచారం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోందని స్థానికులంటున్నారు.
Priest Adventure
ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, హోమాలు, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలో ఉన్న యువతులు వేసిన లంబాడి నృత్యం పలువురిని ఆకట్టుకుంది. అనంతరం సిరిమానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పొడవాటి మొద్దుకు పూజారిని కట్టి.. పైకి ఎత్తి గాలిలో తిప్పారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ గీతాలాపన కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఇవీ చదవండి: