అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అగలి మండలంలోని పెద్దలకు, పలు పాఠశాలల చిన్నారుల చేతులు, కాళ్లపై వింతగా ఎర్రటి మచ్చలు ఏర్పడ్డాయి. వాటిని చూసి పిల్లల తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. ఎమ్ఈవో గోపాల్, స్థానిక వైద్యాధికారి శివానంద మథూడి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులను పరిశీలించి మందులు అందజేశారు. వర్షాకాలంలో నత్తల జిగురు వల్ల ఈ సమస్య ఏర్పడుతుందని వైద్యులు పేర్కొంటున్నారు.
RED SPOTS: శరీరంపై ఎర్రటి మచ్చలు.. ఆందోళనలో ప్రజలు - People with red spots on body in madakashira
శరీరం అంతా ఎర్రమచ్చలు రావటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అగలి మండలంలో చిన్నా,పెద్దా.. అందరికీ ఈ మచ్చలు ఏర్పడ్డాయి.
![RED SPOTS: శరీరంపై ఎర్రటి మచ్చలు.. ఆందోళనలో ప్రజలు Red spots on the body](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12869470-175-12869470-1629871833506.jpg)
శరీరంపై ఎర్రటి మచ్చలు