తన అక్క, బావ నుంచి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని అనంతపురం జిల్లా ఆజాద్నగర్కు చెందిన వంశీకృష్ణ ఆరోపించారు. ప్రెస్ క్లబ్లో మాట్లాడిన ఆయన గతంలో తన తండ్రి అడిషనల్ ఎస్పీగా ఉండి.. తోబుట్టువులకు ఆస్తిని వీలునామా ప్రకారం ఆనాడే ఇచ్చినట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం తన అక్కలు తమకు ఇంకా ఆస్తి రావాలని తనను వేధిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. తన బావ బాలాజీ డీఐజీ కావటంతో.. పరపతిని ఉపయోగించి పోలీసులతో వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇవాళ జిల్లా ఎస్పీని కలిసి తమ సమస్యను విన్నవించుకున్నట్లు వెల్లడించారు. నిన్న రాత్రి ఇంటి వద్దకు వచ్చి తనపైన, తన భార్యపైనా చేశారన్నారు. తన కుటుంబానికి వారి నుంచి ప్రాణహాని ఉందని.. పోలీసులు తమకు న్యాయం చేయాలని కోరారు.
ఆస్తి కోసం అక్క దాడి చేసిందని తమ్ముడి ఆరోపణ - sister attacked on brother latest news update
అక్క, బావ నుంచి తనకు ప్రాణహాని ఉందని అనంతపురం జిల్లా ఆజాద్నగర్కు చెందిన వంశీకృష్ణ ఆరోపించారు. తన తండ్రి అడిషనల్ ఎస్పీగా ఉన్నప్పుడే ఆస్తి వీలునామ ప్రకారం పంపకాలు జరిపినట్లు తెలిపారు. అక్క తమపై దాడికి పాల్పడినట్లు వెల్లడించారు. ఈమేరకు ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
ఆస్తి కోసం అక్క దాడి చేసిందని తమ్ముడి ఆరోపణ