ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేరుకే ఆదర్శం... వెళ్లాలంటే భయం భయం...! - adharsha school does not have road and bus facilities

ఆ పాఠశాలకు వెళ్లాలంటే విద్యార్థులు ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని పోవాల్సిందే. రోడ్డు మార్గం ఉన్నా ..ఆ దారికి అధిక మలుపులు, పెద్ద పెద్ద బండరాళ్లు,దారికి ఇరువైపులా ముళ్ళ కంపలుతో అధ్వానంగా ఉంది. పైగా ఒకే బస్సులో 150 నుండి 160 దాకా విద్యార్థులతో భయంగా ప్రయాణం చేస్తున్నారు.

adharsha school does not have road and bus facilities at mushtur in uravakonda

By

Published : Sep 20, 2019, 3:05 PM IST

ఉరవకొండ మండలం చిన్న ముష్టూరు గ్రామంలో ఉన్న ఏపీ ఆదర్శ పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సరైన రోడ్డు సౌకర్యం, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బస్సు సర్వీసులు లేకపోవడంతో వారి పరిస్థితి అధ్వానంగా మారింది. ఒకే బస్సులో 150 నుండి 160 దాకా విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. గతంలో ఇదే దారిలో విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడి పలువురికి గాయాలు అయ్యాయి. అంతేగాక బస్సు ఊర్లోకి వెళ్లలాంటే అధిక మలుపులు, పెద్ద పెద్ద బండరాళ్లు, ఇంటి రేకులు, కరెంట్ స్తంభాలు తప్పిస్తూ.. ఇరుకు ప్రాంతాల్లో ప్రయాణం సాగించాలి.
ఒకే బస్సులో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ పాఠశాలకు వెళ్తుండటంతో పిల్లల తల్లిగదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బస్సు సౌకర్యం, రోడ్డు సదుపాయం కల్పించాలని కోరుతున్నారు.

ఆ పాఠశాలకు వెళ్లాలంటే భయమే..!

ABOUT THE AUTHOR

...view details