అనంతపురం ఆదర్శ నగర్లో మహిళ నిర్మల హత్య కేసులో నిందితులను రెండో పట్టణ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. సీఐ జాకీర్ హుస్సేన్ తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 3న నిర్మలపై హత్యాయత్నం జరిగింది. బెంగుళూరులో చికిత్స పొందుతూ ఆమె 16వ తేదీన మృతి చెందింది.
నిందితులు.. నిర్మల దత్తపత్రుడు చల్లా మనోజ్ కుమార్, అతని స్నేహితుడు వెంకటరాజును ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. మనోజ్, నిర్మల మధ్య ఆస్తి వివాదాలు ఉన్నాయి. తల్లిని చంపేస్తే ఆమె పేరుతో బళ్లారిలో ఉన్న ఆస్తి కాజేయవచ్చన్న దురుద్దేశంతోనే మనోజ్ హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఆస్తి వివాదంపై బళ్లారి కోర్టులో కేసు విచారణలో ఉంది. మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.