అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలోని రాళ్ల అనంతపురం డీసీ పల్లి గ్రామాల మధ్య మోటార్ సైకిల్ అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కర్ణాటకలోని పావగడ నుంచి డీసీ పల్లి వైపు వెళ్తున్న మురళి అనే వ్యక్తి మోటార్ సైకిల్ పై వస్తుండగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న బండరాయికి తగిలాడు. బలంగా తగలటంతో అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. కంబదూరు ఎస్సై గౌస్ పీరా సంఘటన స్థలానికి చేరుకొని శవాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మృతుడి వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉందని ఎస్ఐ తెలిపారు.
మోటార్ సైకిల్ అదుపు తప్పి...బండకు తగలి మృతి - corona cases in anantapur dst
మోటార్ సైకిల్ అదుపుతప్పి బండరాయికి తగిలి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలో జరిగింది.
accidnetly jumped on a stone and died happend in anantapur dst