ప్రమాదవశాత్తు పెన్నా నదిలో మునిగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా పామిడి వద్ద చోటు చేసుకుంది. గుత్తి మున్సిపాలిటీలో ఇంజనీరింగ్ విభాంగలో కాంట్రాక్టు కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తున్న పవన్ కుమార్ త్రాగునీటి పైప్ లైన్‌కు మరమ్మత్తులు చేస్తూ..ప్రమాదవశాత్తు నదిలో జారిపడ్డాడు. గమనించిన తోటి కార్మికులు అతణ్ణి బయటకు తీసేలోపే ప్రాణాలు విడిచాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ప్రమాదవశాత్తు పెన్నానదిలో మునిగి వ్యక్తి మృతి - ప్రమాదవశాత్తు పెన్నానదిలో మునిగి వ్యక్తి మృతి
అనంతపురం జిల్లా పామిడి వద్ద ప్రమాదవశాత్తు పెన్నా నదిలో మునిగి గుత్తి మున్సిపాలిటీ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఒప్పంద కార్మికుడు మృతి చెందాడు. ఘనటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
పెన్నానదిలో మునిగి వ్యక్తి మృతి