అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామానికి చెందిన కొంత మంది కూలీలు... రోజువారిలాగే.. పెద్దవడుగూరు గ్రామానికి పనులకు ఆటోలో వెళ్లడానికి సిద్ధమయ్యారు. మరి కొంతమంది వస్తారని.. ఆటోను తొండపాడు బస్టాండ్ వద్ద నిలిపి ఉంచారు. ఈ క్రమంలో వెనకు వైపు నుంచి లారీ అతివేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న 12 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆగి ఉన్న ఆటోను ఢీ కొట్టిన లారీ.. ముగ్గురి పరిస్థితి విషమం - అనంతపురం జిల్లా గుత్తిలో రోడ్డు ప్రమాదం తాజా వార్తలు
నిలిచి ఉన్న ఆటోను లారీ ఢీ కొట్టడంతో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా అనంగుత్తి మండలం తొండపాడు గ్రామంలో చోటుచేసుకుంది.
ఆగి ఉన్న ఆటోను ఢీ కొట్టిన లారీ.. ముగ్గురి పరిస్థితి విషమం