గుంతకల్లు పట్టణానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దసరా పండుగను ముగించుకొని కాల క్షేపం కోసం మిత్రులతో కలిసి రెండు ద్విచక్రవాహనాలపై మండలంలోని బుగ్గ సంఘాల గ్రామం వద్దకు వెళ్లారు. అక్కడే మధ్యాహ్న సమయం వరకు ఉండి భోజనం చేసి గుంతకల్లులోని తమ ఇళ్లకు బయలుదేరారు. మార్గం మధ్యలోని కసాపురం గ్రామం వద్దకు రాగానే ముగ్గురు యువకులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం వేగంలో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న డివైడర్ ను ఢీకొట్టింది. ద్విచక్ర వాహనం ఒక్కసారిగా పల్టీలు కొడుతూ పడిపోవడంతో దానిపై ఉన్న భాస్కర్ (25)అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ఇద్దరు స్నేహితులకు కాళ్లకు, చేతులకు బలమైన గాయాలు అవ్వడంతో చికిత్స నిమిత్తం కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. భాస్కర్ కు ఈమధ్యనే వివాహం అయింది. గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న బంధువులు రోదనలు స్థానికులను కలిచివేశాయి. ఈ ఘటనపై కసాపురం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి, ఇద్దరికి గాయాలు - అనంతపురం జిల్లా గుంతకల్లులో రోడ్డు ప్రమాదం వార్తలు
అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని కసాపురం గ్రామంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి, ఇద్దరికి గాయాలు