రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. నలుగురి పరిస్థితి విషమం - వాహనం బోల్తా, ఒకరు మృతి

రోడ్డు ప్రమాదం
07:48 November 07
కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తా
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చుక్కలూరు క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తా పడడంతో ఒకరు మృతి చెందారు. మరో 19 మంది కూలీలకు గాయాలయ్యాయి. తాడిపత్రి నుంచి బ్రాహ్మణపల్లిలో పనులకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
ఇదీ చదవండి:ATTACK: ఆగిన నిశ్చితార్థం.. కుటంబసభ్యుల మధ్య తీవ్ర ఘర్షణ
Last Updated : Nov 7, 2021, 1:54 PM IST