ఎదురెదురుగా వచ్చిన రెండు ఆటోలు ఢీకొని.. సమీపంలో ఉన్న ఇన్నోవా వాహనంపైకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. మరో ఆటో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. అనంతపురంలోని సత్యసాయిబాబా కళాశాల.. టీవీ టవర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఆటోలలో ప్రయాణికులు లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన స్థలానికి ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు.
ACCIDENT: రెండు ఆటోలు ఢీ..ఒకరు మృతి - ప్రమాదం
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. నగర శివారులోని టీవీ టవర్ సమీపంలో ఈ ఘటన జరిగింది.
రోడ్డుప్రమాదం
మృతి చెందిన వ్యక్తి కందుకూరుకి చెందిన శ్రీనివాసులుగా పోలీసులు గుర్తించారు. ఆటోలు వేగంగా రావడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని.. పోలీసులు నిఘా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.