అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని ఒంటిమిద్ది గ్రామం సమీపంలో ప్రధాన రహదారి పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ రైతు మృతి చెందాడు. కూరాకుల తోట గ్రామానికి చెందిన రైతు పెద్ద తిమ్మన్న అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వైపు వస్తున్న సుమో వాహనం టీవీస్ ఎక్సల్ వాహనాన్ని ఢీ కొనటంతో ఎడమ కాలు పూర్తిగా విరిగిపోయింది.
రోడ్డుప్రమాదంలో రైతు మృతి - accidet news in anatapur dst
అనంతపురం జిల్లా ఒంటిమిద్ది గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ఓ రైతుకు తీవ్రగాయలయ్యాయి..చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు.
![రోడ్డుప్రమాదంలో రైతు మృతి accident in anantapur dst farmer died](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7412661-866-7412661-1590852115610.jpg)
accident in anantapur dst farmer died
అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిన రైతును హుటాహుటిన కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి 108లో తరలించి ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అనంతపురం వెళ్లే లోపే రైతు మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.