అనంతపురం జిల్లా ధర్మవరం మండలం నేలకోట వద్ద విద్యుత్ స్తంభాలు తీసుకువెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న ఏలు కుంట్ల గ్రామానికి చెందిన రమణమ్మ సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఆమె కుమారుడు అశోక్ గాయపడ్డాడు. ధర్మవరం గ్రామీణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. రమణమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ట్రాక్టర్ బోల్తాపడి మహిళ మృతి - latest accident news in anantapur dst
అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలో ట్రాక్టర్ బోల్తాపడి మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి.
accident in anantapur dst dharmavaram mandal one person died
TAGGED:
crime news in anantapur dst