ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏకాగ్రతతోనే ప్రమాద రహిత ప్రయాణం: ఎస్పీ - ప్రమాదరహిత డ్రైవర్లను సన్మానం వార్తలు

ఉరవకొండ డిపోలో... ప్రమాదరహిత డ్రైవర్లను సన్మానించారు. అనంతపురం ఆర్​ఎమ్ కార్యాలయంలో నిర్వహించిన రోడ్డు భద్రత ముగింపు వారోత్సవాల కార్యక్రమంలో.. జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు అభినందనలు తెలిపి వారిని సత్కరించారు.

Accident-free travel with concentration
ఏకాగ్రతతోనే ప్రమాద రహిత ప్రయాణం : ఎస్పీ

By

Published : Feb 4, 2021, 11:49 AM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ డిపోలో... ప్రమాదరహితంగా విధులు నిర్వర్తించిన డ్రైవర్లను సన్మానించారు. నారాయణ, వెంకటేశులు, బాషా అనే ముగ్గురు డ్రైవర్లను ఉత్తమ ప్రమాదరిహత డ్రైవర్లుగా ఎంపిక చేశారు. అనంతపురం ఆర్​ఎమ్ కార్యాలయంలో నిర్వహించిన రోడ్డు భద్రత ముగింపు వారోత్సవాల కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు అభినందనలు తెలిపి సత్కరించారు.

ఏకాగ్రతతోనే ప్రమాదాలను నివారించవచ్చని.. ప్రతి ఒక్కరు విధులకు వచ్చే సమయంలో తగిన విశ్రాంతి తీసుకోవాలని ఎస్పీ చెప్పారు. రీజియన్ వ్యాప్తంగా ప్రమాద రహిత డిపోగా కూడా ఉరవకొండ మొదటి బహుమతి అందుకుంది.

ABOUT THE AUTHOR

...view details