అనంతపురం జిల్లా ఉరవకొండ సమీపంలోని బళ్లారి జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. పాల్తూరు నుంచి అమిద్యాలకు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి టిప్పర్ లారీ ఢీ కొనడంతో ఆటోలో ప్రయాణించే 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పెట్రోలింగ్ పోలీసులు గమనించి గాయపడిన వారిని ఉరవకొండ ఆసుపత్రికి తరలించారు. వీరిలో సురేంద్ర అనే బాలుడి పరిస్థితి విషమంగా ఉందని అనంతపురం తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. ఆరు నెలల చిన్నారి అమృతకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పాల్తూరు గ్రామంలో వివాహ వేడుకకు హాజరై అర్ధరాత్రి సమయంలో తిరిగి ఆటోలో స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందిని బాధితులు తెలిపారు.
బళ్లారీలో రోడ్డు ప్రమాదం... ఓ బాలుడు మృతి - uravakonda
అనంతపురం జిల్లా ఉరవకొండ సమీపంలో తప్పిన ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మందికి గాయాలు ఒకరు మృతి.
బళ్లారీ జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం... ఒకరు మృతి