ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అనిశా వలలో జెడ్పీ కార్యాలయ సూపరింటెండెంట్

పోలింగ్ కేంద్రాల్లో అమర్చిన ఎలక్ట్రికల్ పరికరాల బిల్లు మంజూరుకు లంచం తీసుకుంటూ జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్ రబ్బాని అడ్డంగా దొరికిపోయాడు. నిందితుడిని కర్నూలు అనిశా కోర్టులో హాజరుపరచనున్నారు.

By

Published : Aug 13, 2020, 9:13 PM IST

Published : Aug 13, 2020, 9:13 PM IST

acb rides on ananthapuram zp office
acb rides on ananthapuram zp office

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ బూత్​లలో ఎలక్ట్రికల్ పరికరాలు అమర్చడానికి 32 లక్షల నిధులతో చేసే పనిని లాల్ బాషతో పాటు మరో ఐదుగురికి ప్రభుత్వం అప్పగించింది. దీనికి సంబంధించిన బిల్లు మొత్తాన్ని జిల్లా పరిషత్ ఇంజినీరింగ్ విభాగం నిధుల నుంచి ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. తొలి విడతగా 20 లక్షల రూపాయలు చెల్లించటానికి జడ్పీ ఇంజినీరింగ్ విభాగంలో సూపరింటెండెంట్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, కంప్యూటర్ ఆపరేటర్, కార్యాలయంలోని మరికొందరి ఉద్యోగులు 25 వేల 500 రూపాయల లంచం డిమాండ్ చేశారు.

ఈ మొత్తాన్ని గుత్తేదారు నుంచి వసూలు చేసి ఇచ్చేలా సూపరింటెండెంట్ రబ్బానికి బాధ్యత అప్పగించారు. గుత్తేదారు నుంచి రబ్బాని సప్తగిరి కూడలిలో డబ్బు తీసుకుంటుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు. రబ్బాని నుంచి 25,500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు అనిశా కోర్టులో హాజరుపరుస్తామని అనిశా అధికారులు వెల్లడించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details