ఏసీబీ వలలో దేవాదాయ శాఖ ఉద్యోగులు చిక్కారు. అనంతపురం జిల్లా ఉరవకొండ గవిమఠం పరిధిలోని ఒక బిల్డింగ్ లీజు విషయంలో దేవాదాయశాఖ అధికారి శంకర్ అతని సహాయకులు రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రాజు అనే వ్యక్తి లీజు తీసుకున్న బిల్డింగ్ తిరిగి రెన్యువల్ విషయంలో నిందితులు రూ.2లక్షలు డిమాండ్ చేసినట్లు అధికార్లు తెలిపారు. ఈ విషయాన్ని బాధితుడు ఏసీబీ ఆశ్రయించగా, నిందితుడ్ని వల పన్ని రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికార్లు.
ఏసీబీ వలకు చిక్కిన దేవాదాయ శాఖ ఉద్యోగులు - అనంతపురం జిల్లా
దేవాదాయశాఖ అధికారులు రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ, ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో చోటుచేసుకుంది.
![ఏసీబీ వలకు చిక్కిన దేవాదాయ శాఖ ఉద్యోగులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4284730-725-4284730-1567148476345.jpg)
గనిమఠంపై ఏసీబీ దాడులు.. 2లక్షలు పట్టివేత