ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెవెన్యూ కార్యాలయాల్లో అనిశా అధికారుల సోదాలు - acb rides news in andhrapradesh

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏక కాలంలో అనంతపురం, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలోని పలు రెవెన్యూ కార్యాలయాలపై అనిశా అధికారులు దాడులు నిర్వహించారు.

పలు జిల్లాలో రెవెన్యూ కార్యాలయాపై అనిశా దాడులు
పలు జిల్లాలో రెవెన్యూ కార్యాలయాపై అనిశా దాడులు

By

Published : Jan 24, 2020, 6:57 PM IST

జిల్లాలో రెవెన్యూ కార్యాలయాపై అనిశా దాడులు

అనంతపురం జిల్లా ముదిగుబ్బ తహసీల్దార్ కార్యాలయంలో అనిశా అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. మూడు నెలలుగా ముదిగుబ్బ తహసీల్దార్ కార్యాలయంలో మంజూరైన పేదల ఇంటి పట్టాలు, పట్టాదారు పాసు పుస్తకాలు, భూకొలతలకు సంబంధించిన అభ్యర్థనల దస్త్రాలను లోతుగా పరిశీలించారు.

జిల్లాలో రెవెన్యూ కార్యాలయాపై అనిశా దాడులు

రేణిగుంట, వడమాలపేటలో...
చిత్తూరు జిల్లా రేణిగుంట, వడమాలపేట తహసీల్దార్ కార్యాలయాల్లోనూ అనిశా అధికారులు తనిఖీలు చేసి రికార్డులు పరిశీలించారు.

రెవెన్యూ కార్యాలయాల్లో అనిశా అధికారుల సోదాలు

కొత్తూరు, ఎచ్చెర్లలో..
శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరు, ఎచ్చెర్ల తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రికార్డులు పరిశీలించారు.

ఇవీ చదవండి

స్మార్ట్​ సిటీ లక్ష్యాలను చేరుకున్న నగరాలకు అవార్డులు

ABOUT THE AUTHOR

...view details