ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డ్రైవింగ్ లైసెన్సులకు నగదు వసూళ్లు.. అనిశా సోదాలు - అనంతపురం ఆర్టీఏలో ఏసీబీ రైడ్స్ వార్తలు

ప్రజల నుంచి స్పందనలో వచ్చిన ఫిర్యాదు మేరకు అనంతపురం ఆర్టీఏ కార్యాలయంలో సోదాలు నిర్వహించామని అనిశా డీఎస్పీ కులశేఖర్ తెలిపారు. ఈ తనిఖీల్లో అనిశా అధికారులు రూ.1.6 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

acb ride on ananthapuram rta
acb ride on ananthapuram rta

By

Published : Mar 30, 2021, 8:57 PM IST

అనంతపురం ఆర్టీఏ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన అనిశా అధికారులు.. నగదును స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు ఏజెంట్లు, సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్సులకు నగదు వసూళ్లు చేస్తున్నారనే ఫిర్యాదులతో తనిఖీలు చేపట్టారు.

అనుమానంగా వెళ్తున్న వాహనాన్ని ఆపి పరిశీలించగా.. అందులో మోటార్ వెహికల్ ఇన్​స్పెక్టర్ ఇస్మాయిల్ ఉన్నాడని.. అతని వద్ద నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఐదుగురు ఏజెంట్ల వద్ద మరికొంత సొమ్మును పట్టుకున్నట్టు డీఎస్పీ కులశేఖర్ వెల్లడించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details