ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ.లక్షన్నర లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆలయ ఈఓ - గుంతకల్లు మండలం కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థాన అధికారుల అవినీతి

అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురంలో నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థాన అధికారుల అవినీతి బయటపడింది. కారుణ్య నియామకం కోసం ఎదురుచూస్తున్న ఓ వ్యక్తి నుంచి రూ.లక్షన్నర లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఆలయ ఈవో, సీనియర్ అసిస్టెంట్ పట్టుబడ్డారు.

acb-raids-on-nettikamti-anjaneya-swamy-temple
ఏసీబీకి చిక్కిన ఆలయ ఈఓ

By

Published : Nov 2, 2020, 4:02 PM IST

అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థాన అధికారుల అవినీతి బయటపడింది. కారుణ్య నియామక దరఖాస్తు చేసుకున్న వినయ్ అనే వ్యక్తి నుంచి ఈఓ విజయ సాగర్​ బాబు రూ. 1.50 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 3నెలల కిందట కరోనాతో మృతి చెందిన ఆలయ అర్చకుడు కళాస్వామి కుమారుడు వినయ్ కుమార్ కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే పింఛన్ కోసం రూ. 1.20 లక్షలు అందజేశారు. మరలా అదనంగా రూ.1.50 లక్షలు కావాలని ఇబ్బందులకు గురి చేయటం వల్ల బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

వినయ్​ నుంచి ఏఓ విజయ సాగర్​ బాబు, సీనియర్ అసిస్టెంట్ వేమన్న నగదు తీసుకుంటుండగా ఏసీబీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ అవినీతి వ్యవహారంలో ఎంతమందికి ప్రమేయం ఉందో స్పష్టత రావాల్సి ఉంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details