అనంతపురం జిల్లా పరిగి మండలంలో కేజీబీవీ పాఠశాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. పాఠశాలలోని ఎస్వో కార్యాలయంలోని పలు రికార్డులను తనిఖీ చేశారు. బయట వ్యక్తులు లోపలికి రాకుండా గేట్లకు తాళాలు వేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎస్వో రమాదేవి ఇంటి నుంచి రికార్డ్స్ తెప్పించుకొని పరిశీలించారు. పూర్తి వివరాల వెల్లడికి కొంత సమయం పడుతుందని ఏసీబీ అధికారులు చెప్పారు.
పరిగి కేజీబీవీలో అనిశా అధికారుల తనిఖీలు - అనంతపురం ఏసీబీ న్యూస్
పరిగి మండలంలో ఉన్న కేజీబీవీలో అనిశా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎస్వో కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు.
పరిగి మండలం కేజీబీవీలో అనిశా అధికారుల తనిఖీలు