అనంతపురం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కార్యాలయంలో అనిశా అధికారులు తనిఖీలు నిర్వహించారు. అనిశా అధికారులు వస్తున్నారన్న సమాచారంతో జిల్లా వైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్ కార్యాలయం నుంచి వెళ్లి పోయే ప్రయత్నం చేశారు. అనిశా అధికారులు డీఎంహెచ్ఓ వాహనానికి.. తమ వాహనాన్ని అడ్డుపెట్టి అనిల్ కుమార్ను లోపలికి పిలిచారు.
జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కార్యాలయంలో అనిశా తనిఖీలు - ananthapuram latest news
అనంతపురం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కార్యాలయంలో అనిశా అధికారులు తనిఖీలు నిర్వహించారు. తిరుపతి నుంచి వచ్చిన అనిశా డీఎస్పీ ఆల్లాబకాష్ ఆధ్వర్యంలో పది మంది అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు.
జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కార్యాలయంలో అనిశా తనిఖీలు
డాక్టర్ అనిల్ కుమార్ డీఎంహెచ్ఓగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఏ వస్తువులు కొనుగోలు చేశారు, సిబ్బంది, వైద్యుల నియామాకాలకు సంబంధించి ఆరా తీస్తున్నారు. తొలుత డీఎంహెచ్ఓతో ఛాంబర్లో ప్రత్యేకంగా మాట్లాడిన అనిశా అధికారులు... కార్యాలయంలోని అన్ని గదుల్లో కంప్యూటర్లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వైద్యారోగ్య సిబ్బంది ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు రీయంబర్స్మెంట్ చేసుకోవడానికి మామూళ్లు తీసుకుంటున్నారన్న ఆరోపణలపై ప్రశ్నించారు.