ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్​డబ్ల్యూఎస్ కార్యాలయంలో అనిశా దాడులు

అనంతపురం జిల్లా పెనుకొండలోని పీఆర్ఆర్ డబ్ల్యూఎస్ కార్యాలయంలో బుధవారం అనిశా (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. సీనియర్ అసిస్టెంట్ దాసన్న దగ్గర అనధికారికంగా ఉన్న పదమూడు వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.

ఆర్​డబ్ల్యూఎస్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
ఆర్​డబ్ల్యూఎస్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

By

Published : Sep 30, 2020, 8:34 PM IST

అనంతపురం జిల్లా పెనుకొండలోని పీ.ఆర్.ఆర్. డబ్ల్యూ.ఎస్. కార్యాలయంలో బుధవారం అనిశా అధికారులు దాడులు చేశారు. ఆర్​డబ్ల్యూఎస్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ పనిచేస్తున్న దాసన్న అనే వ్యక్తి నుంచి అనధికారికంగా ఉన్న 13 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను అనిశా డీఎస్పీ వెల్లడించారు.

గత ఏడాది అమరాపురం మండలం అగ్రహారం గ్రామానికి చెందిన మోహన్ కుమార్ మంచినీటి పథకం కింద దాదాపు 8 లక్షల రూపాయల పనులు చేశాడు. ఏడాదైనా బిల్లులు చేయకపోగా 18 వేల రూపాయలు సీనియర్ అసిస్టెంట్ దాసన్న.. మోహన్ అనే వ్యక్తి నుంచి నగదు డిమాండ్ చేశారు. అతను డబ్బులు ఇవ్వడానికి ఇష్టంలేక అనిశాను ఆశ్రయించారు. బుధవారం 13 వేల రూపాయలను మోహన్ కుమార్.. సీనియర్ అసిస్టెంట్ దాసన్నకు ఇవ్వగా అనిశా అధికారులు వలపన్ని పట్టుకున్నట్లు డీఎస్పీ అల్లాబకాష్ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details