అనంతపురంలో అనిశా అధికారులు దాడులు నిర్వహించారు. నగర పాలిక సర్వే విభాగంలో పనిచేస్తున్న డి. కోటేశ్వరరావు... ప్రసాద్ అనే వ్యక్తి నుంచి రూ. 7 లక్షలు లంచం తీసుకునే ప్రయత్నంలో పట్టుకున్నారు. ఓ ఇంటి స్థలం విషయంలో సర్వే చేయాలని కోటేశ్వరరావు దగ్గరికి వెళ్లగా... ఆ స్థలం ప్రస్తుత ధరను బట్టి 10 లక్షలు లంచం ఇస్తేనే సర్వే చేస్తామని చెప్పగా... బాధితుడు ప్రసాద్ 1100కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.
స్పందించిన అనిశా అధికారులు.. పథకం ప్రకారం నిందితుడిని పట్టుకున్నారు. ప్రసాద్ రూ. 10 లక్షలు లేవని చెప్పగా... కోటేశ్వరరావు రూ. 7 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. డబ్బు తీసుకోవడానికి తన వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శివను ప్రసాద్ వద్దకు పంపాడు. శివ డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకుని విచారించారు. అతను కోటేశ్వరరావు పేరు చెప్పగా... అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేస్తామని డీఎస్పీ తెలిపారు.