ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన లైన్ మెన్ - latest news in anantapur district

విద్యుత్ కనెక్షన్ కోసం రైతు నుంచి లంచం తీసుకుంటున్న ఓ లైన్ మెన్​ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఈ ఘటన జరిగింది.

Power Line Men
విద్యుత్ లైన్ మెన్

By

Published : Jul 20, 2021, 10:53 PM IST

విద్యుత్ కనెక్షన్ కోసం.. రైతు నుంచి లంచం తీసుకుంటున్న ఓ లైన్ మెన్​ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసులు తోటకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వటానికి నెల క్రితం విద్యుత్ లైన్​మెన్​ రంగరాజు రూ.30,000 లంచం అడిగాడు. దీంతో విసుగు చెందిన రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సలహా మేరకు గుత్తిలోని టీ కేఫ్​లో విద్యుత్ లైన్ మెన్​కు రూ.12,500 నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఈ ఘటన పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details