అనంతపురంలో ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన మరో తిమింగళాన్ని అనిశా అధికారులు గుర్తించారు. జిల్లా పంచాయతీరాజ్ శాఖలో సహాయ ఇంజనీర్‌గా సురేష్‌రెడ్డి పని చేస్తున్నారు. రామనగర్ కాలనీలోని అయన ఇంట్లో అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు. పుట్టపర్తిలో రెండు చోట్ల బంధువుల ఇళ్లలో, కర్నూలు జిల్లా బేతంచెర్లలోని తన భార్య పుట్టింట్లో ఒకే సమయంలో సోదాలు జరిపారు. దాడులలో రూ.5లక్షల నగదు, 300 గ్రాముల బంగారు నగలు, వాణిజ్య సముదాయ భవనం, వ్యవసాయ భూములు, నివాస స్థలాలు గుర్తించారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ దాదాపు రూ.4 కోట్లు ఉంటుందని అనిశా అధికారులు చెప్పారు. సోదాలు ఇంకా జరుగుతున్నాయని ఏసీబీ డీఎస్పీ నాగభూషణం తెలిపారు.
అనిశాకు చిక్కిన అనంతపురం పంచాయితీరాజ్ ఈఈ
అనంతపురం జిల్లాకు చెందిన పంచాయితీరాజ్ ఈఈ సురేష్ రెడ్డి ఇంట్లో అనిశా అధికారులు సోదాలు చేశారు. కర్నూలు జిల్లాల్లో నాలుగు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు.
వివరాలు సేకరిస్తున్న అనిశా డీఎస్పీ నాగభూషణం