అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చిన వీరభద్రుడి పర్యటన రసాభాసగా మారింది. కదిరి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో నాడు-నేడు కింద చేపట్టిన పనులను పరిశీలించేందుకు చిన వీరభద్రుడు వచ్చారు. విషయం తెలుసుకున్న ఏబీవీపీ నాయకులు పాఠశాల ప్రధాన ద్వారం ఎదుట ఆందోళన చేపట్టారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొందరు ఉపాధ్యాయులు పాఠశాల విధుల కంటే ఇతర వ్యవహారాలకే ప్రాధాన్యమిస్తున్నారని అన్నారు. వీరిపై వివిధ స్థాయిల్లో ఫిర్యాదు చేసినా.. అధికారులు స్పందించడం లేదంటూ చిన వీరభద్రుడిని అడ్డుకుని రోడ్డుపై బైఠాయించారు.
కదిరిలో ఏబీవీపీ ఆందోళన..చిన వీరభద్రుడిని అడ్డుకుని రోడ్డుపై బైఠాయింపు - అనంతపురం జిల్లా సమాచారం
కదిరి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో నాడు-నేడు కింద చేపట్టిన పనులను పరిశీలించేందుకు వచ్చిన పాఠశాల విద్యా శాఖ కమిషనర్ చిన వీరభద్రుడిని ఎబీవీపీ నాయకులు అడ్డుకున్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొందరు ఉపాధ్యాయులు పాఠశాల విధులకు అంటే ఇతర వ్యవహారాలకే ప్రాధాన్యమిస్తున్నారని ఫిర్యాదు చేశారు.
పాఠశాల విద్యా శాఖ కమిషనర్ చిన వీరభద్రుడు
విద్యార్థి సంఘ నాయకుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తూ చిన వీరభద్రుడు అక్కడినుంచి వెళ్లిపోయారుు. పోలీసులు విద్యార్థి సంఘ నాయకులను అరెస్టు చేశారు. ఆ తరువాత అధికారులు విద్యాశాఖ కమిషనర్‌ను పాఠశాల ఆవరణలో తీసుకొచ్చారు. అనంతరం ఆయన నాడు-నేడు కింద చేపట్టిన పనులను పరిశీలించారు.
ఇదీ చదవండి:పాఠశాలలో ఇద్దరికి కరోనా పాజిటివ్.. భయాందోళనలో తల్లిదండ్రులు