ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆపద సమయంలో 'ఆ నలుగురు'.. చివరి మజిలీకి వారే సాక్షులు!

కరోనా వేళ మనం చూస్తున్న కన్నీటి చారలెన్నో..! దయనీయ గాథలు మరెన్నో..! అయినవారి అంత్యక్రియలు చేసేందుకే జనం ముందుకు రాని పరిస్థితులను చూసి చలించిపోయిన ఓ స్వచ్ఛంద సేవా సంస్థ. సంప్రదాయబద్ధంగా కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తోంది. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన 'ఆ నలుగురు' సేవా సమితి.. తమ సేవలతో అందరి అభినందనలనూ అందుకుంటోంది. కొవిడ్ తొలి దశలో మొదలుపెట్టిన సేవలు.. ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నామని సమితి సభ్యులు తెలిపారు.

aa naluguru helping trust
'ఆ నలుగురు' సేవా సమితి..

By

Published : May 9, 2021, 7:56 PM IST

'ఆ నలుగురు' సేవా సమితి..

కరోనా మహమ్మారి కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోతే అంత్యక్రియలు సైతం నిర్వహించలేని పరిస్థితి. ఇలాంటి స్థితిలో మానవత్వమే తమ అభిమతమని చాటుతున్నారు గుంతకల్లు పట్టణానికి చెందిన 'ఆ నలుగురు' సేవ సమితి సభ్యులు. కరోనా సోకి మరణించిన వారికి.. అంత్యక్రియలు చేయడానికి ఎవరూ ముందుకు రాని పక్షంలో వారే చివరి తంతు పూర్తి చేస్తున్నారు. బాధితులు కుటుంబానికి బాసటగా నిలుస్తున్నారు.

అన్నీ తామై..

అనంతపురం జిల్లాలోని గుంతకల్లు పట్టణంలో ఒక్క రోజులోనే ఐదు నుంచి ఆరు మంది వరకు కరోనాతో మరణించారు. బంధువులు సైతం వారికి అంత్యక్రియలు చేసేందుకు ముందుకు రాకపోగా.. విషయం తెలుసుకున్న ఆ నలుగురు ప్రతినిధులు.. బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. మృతి చెందిన వారి సంప్రదాయం ప్రకారమే అంతిమ సంస్కారాలు పూర్తి చేస్తూ.. బాధితులకు ఊరట కల్పించారు.

ABOUT THE AUTHOR

...view details