అనంతపురం జిల్లా గుంతకల్లులోని హనుమేష్ నగర్లో ఉంటున్న ప్రవీణ్ అనే యువకుడు తన మిత్రులతో కలిసి సరదాగా హంద్రీనీవా కాలువ వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తూ ప్రవీణ్ కాలుజారి కాలువలో పడ్డాడు.
అదే సమయంలో అక్కడకు వెళ్లిన 'ఆ నలుగురు' సేవా సమితి సభ్యులు కొట్టుకుపోతున్న యువకుడిని చూసి కాపాడారు. ప్రాథమికి చికిత్స అందించి అతన్ని ఇంటికి పంపించారు.