అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో కుమ్మరి నాగన్న అనే కాపరికి దాదాపు 30 మేకలు ఉన్నాయి. అందులో ఒక మేకపోతు దాదాపు 15 రోజుల నుంచి పాలు ఇవ్వడం ప్రారంభించింది. ఈ వింతను చూడటానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. కొన్నిసార్లు జన్యు మార్పిడి వల్ల ఇలా జరిగి ఉండవచ్చు అని అంటున్నారు పశువైద్యులు.
పాలిస్తున్న మేకపోతు... ఎగబడి చూస్తున్న జనం..!
మేకపోతు పాలివ్వడం ఎక్కడా కనివిని ఎరిగి ఉండరు. కానీ... అనంతపురం జిల్లా బెలుగుప్ప బ్రాహ్మణపల్లిలో ఓ మేకపోతు 15రోజుల నుంచి లీటర్ల కొద్ది పాలు ఇస్తుంది. ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కన ప్రజలు వస్తున్నారు. మీరూ ఓ లుక్కేయండి.
a zent gpat gave milk in anantapur dst