ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బావిలో ఈత..తలకు బలమైన గాయాలై మృతి - ఈతకు వెళ్లి యువకుడు మృతి తాజా వార్తలు

అనంతపురం జిల్లా గుంతకల్లులో హోలీ పండుగ రోజు విషాదం చోటు చేసుకుంది. సరదాగా మధ్యాహ్నం వరకు స్నేహితులతో కలిసి ఒకరికొకరు హోలీ రంగులు పూసుకొని సంతోషంగా గడిపి కొద్దీ గంటలు కూడా కాకముందే అంతలోనే తీవ్ర విషాదం జరిగింది. తల్లిదండ్రులతో ఈతకు వెళ్లి వస్తానని చెప్పిన కొడుకు ప్రమాదశావత్తు బావిలో పడి చనిపోయాడు.

man fall into a well and died
ఈతకు వెళ్లిన యువకుడు మృతి

By

Published : Mar 28, 2021, 9:21 PM IST

అనంతపురం జిల్లా గుంతకల్లులో ఈతకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు బావిలో మునిగి చనిపోయాడు. పట్టణానికి చెందిన నరేంద్ర(17) హోలీ ఆడుకున్న అనంతరం స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లాడు. బావిలో దిగిన నరేంద్ర తలకు రాళ్లు బలంగా తగలడంతో నీళ్ల లోపలికి వెళ్లిపోయాడు. నరేంద్ర ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో.. స్నేహితులు కంగారుతో తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, ఫైర్ సిబ్బంది స్థానికులతో కలిసి బావిలో గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు రెండున్నర గంటల తరువాత యువకుడి ఆచూకీ లభ్యమయ్యింది. అప్పటికే నరేంద్ర ప్రాణాలు కోల్పోయాడు. కళ్లముందే స్నేహితుడు తమని వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో స్నేహితులు, బంధు మిత్రులు శోక సముద్రంలో మునిగి పోయారు. ఈతకు వెళ్లిన నరేంద్ర పట్టణంలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు.

ABOUT THE AUTHOR

...view details