ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెను ప్రమాదాన్ని తప్పించిన శిరస్త్రాణం

శిరస్త్రాణం ధరించండి అని పోలీసులు ఎన్నో రకాలుగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా... కొందరు పెడచెవిన పెడుతూ ప్రాణాలు కోల్పోతుంటారు. మరికొందరు మాత్రం నిబంధనలు పాటిస్తూ.. సురక్షిత ప్రయాణాలు చేస్తుంటారు. ప్రమాదాల్లో ప్రాణాపాయం నుంచి బయటపడతారు. అనంతపురం జిల్లాలో జరిగిన ఘటనలో.. ఓ యువకుడు అలాంటి ఆపద నుంచే శిరస్త్రాణంతో ప్రాణాలు దక్కించుకున్నాడు.

helmet survived a person
పెను ప్రమాదాన్ని తప్పించిన శిరస్ర్తాణం

By

Published : Oct 31, 2020, 1:29 PM IST

శిరస్త్రాణం ధరించి ప్రయాణించిన ఓ యువకుడు.. పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అనంతపురం జిల్లా కదిరి పట్టణం సమీపంలో 42 వ నెంబర్ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో.. ప్రాణాలు కాపాడుకున్నాడు. ఓబులదేవరచెరువు మండలం గాజు కుంట పల్లి కి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి కదిరి నుంచి అనంతపురం ద్విచక్రవాహనం పై వెళ్తున్నాడు.

ఈ క్రమంలో అతని వాహనం ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ వేగ నిరోధకాలను ముందుగా గుర్తించక... ఒక్కసారిగా వేగాన్ని అదుపు చేశాడు. వెనుకనే ద్విచక్రవాహనంపై వచ్చిన బాధితుడు వాహనాన్ని అదుపు చేయలేక లారీని ఢీకొన్నాడు. ప్రమాదంలో ద్విచక్ర వాహనం పూర్తిగా దెబ్బతింది. శిరస్త్రాణం ధరించడం వల్ల అతను స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బాధితుడిని స్థానికులు 108 వాహనంలో కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details