అనంతపురం జిల్లా మడుగుపల్లి గ్రామంలో నాటు బాంబులు తయారు చేస్తున్న యువకుడిని పుట్లూరు పోలీసులు అరెస్టు చేశారు. తయారు చేసిన నాటుబాంబులను విక్రయించడానికి వెళుతుండగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు.
పుట్లూరు మండలం మడుగుపల్లి గ్రామానికి చెందిన యాపర్ల నరేష్ కుమార్ రెడ్డి(24)అనే యువకుడు డబ్బు సంపాదించాలని నాటుబాంబులను తయారు చేయాలనుకున్నాడు. నాటుబాంబులను ఎలా తయారు చేయాలో యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాడు.