కోరిక తీర్చాలంటూ ఓ యువకుడు తనను వేధిస్తున్నట్లు అనంతపురం జిల్లా నల్లమాడ మండలానికి చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి తెలిపిన వివరాల ప్రకారం కల్లూరుకు చెందిన నవీన్.. కడప జిల్లా రాజంపేటలో పని చేస్తున్నారు. యువతి పరిచయం కావటంతో కోరిక తీర్చాలంటూ నవీన్ వేధించాడు. లేకపోతే యువతితో పాటు ఆమె కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు. అయితే యువతికి ఐదు నెలల క్రితం వేరే వ్యక్తితో పెళ్లి అయింది. తన భర్తకు లేనిపోనివి చెప్పి కాపురంలో చిచ్చు పెట్టాడని వాపోయింది. తనకు న్యాయం చేయాలని ఆ యువతి సోషల్ మీడియా ద్వారా జిల్లా కలెక్టర్, ఎస్పీని అభ్యర్థించింది. అనంతరం నల్లమాడ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
యువకుడి వేధింపులు తట్టుకోలేక.. పోలీసులను ఆశ్రయించిన యువతి - ananthapuram district crime news
కోరిక తీర్చాలంటూ ఓ యువకుడు తనను వేధిస్తున్నట్లు అనంతపురం జిల్లా నల్లమాడ మండలానికి చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
యువతిని వేధిస్తున్న యువకుడు