ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాలసముద్రం జాతీయ రహదారిపై అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి - కాలసముద్రంలో రోడ్డు ప్రమాద వార్తలు

అనంతపురం జిల్లా కదిరి మండలం కాలసముద్రం వద్ద 42వ నంబర్ జాతీయ రహదారిపై ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతనికి బుద్ధిమాంద్యంతో పాటు మూర్ఛ వ్యాధి ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

a young man dies in suspicious condition on Kalasamudram National Highway
కాలసముద్రం జాతీయ రహదారిపై అనుమానస్పదస్థితిలో వ్యక్తి మృతి

By

Published : Jul 23, 2020, 9:08 AM IST

అనంతపురం జిల్లా కదిరి మండలం కాలసముద్రం జాతీయ రహదారిపై ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కదిరి పట్టణానికి చెందిన మహబూబ్ బాషా స్థానిక జాతీయ రహదారి పక్కన అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి ... పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడి వద్ద లభించిన ఆధారాల మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మహబూబ్ బాషా బుద్ధిమాంద్యంతో పాటు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అప్పుడప్పుడు ఇంటి నుంచి వెళ్తుంటాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అపస్మారకస్థితిలో పడివున్న మహబూబ్ బాషాను ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. గుర్తు తెలియని వాహనాలు ఢీకొని ఉంటాయని పోలీసులు తెలిపారు. పట్నం పోలీసులు కేసు నమోదు చేసి..దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details