ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం.. యువకుడు మృతి - a young man died due to a bike hit a lorry at mandalapalli

ద్విచక్రవాహనం.. లారీ ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. అనంతపురం జిల్లా మండ్లిపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

bike hit a lorry at mandalapalli anantapur district
మండ్లిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం

By

Published : May 17, 2021, 10:19 PM IST

అనంతపురం జిల్లా తనకల్లు మండలం మండ్లిపల్లి సమీపంలో జాతీయ రహదారి 42పై జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మండలంలోని బొంతలపల్లికి చెందిన ఆఫ్రిద్.. తనకల్లుకు వెళ్తున్న క్రమంలో కదిరి నుంచి మదనపల్లె వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆఫ్రిద్​ని స్థానికులు కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురంలోని ఓ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. మృతుడి తండ్రి ఖాదర్వలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.

ABOUT THE AUTHOR

...view details