.
'చచ్చిపోతానంటూ కిరోసిన్ బాటిల్తో యువకుడి పరుగులు...'
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం ఏపీఆర్జేసీ పాఠశాలకు ఆనుకొని ఉన్న స్థలంలో సీపీఐ ఆధ్వర్యంలో వేయించిన గుడిసెలను రెవెన్యూ అధికారులు తొలగించారు. పేదలు వేసుకున్న గుడిసెలను ఇంతకు మందు ఒకసారి తొలగించిన అధికారులు ఇంటి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడవి ఇవ్వకపోగా ఉన్న గుడిసెలను పోలీసుల ఆధ్వర్యంలో తొలగిస్తున్నారు. పట్టాలిస్తానన్న అధికారులు గుడిసెలు తొలగించటాన్ని నిరసిస్తూ రఫీ అనే యువకుడు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. తాను చస్తే... అందుకు అధికారులే కారణమని రోధించాడు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశాడు. రఫీని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కి తరలించారు.
గుడిసెలు తీసేస్తారా.. నేను చస్తా..నా చావుకు మీరే కారణం
Last Updated : Mar 2, 2020, 2:55 PM IST