భర్త వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగింది. పట్టణానికి చెందిన వెంకటలక్ష్మి (26) అనే మహిళ.. తన భర్త శ్రీనివాసులు పెట్టే వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడింది. భవన నిర్మాణ కూలీగా పని చేస్తున్న శ్రీనివాసులు.. నిత్యం భార్యతో గొడవ పడేవాడని బంధువులు చెప్పారు.
భార్యపై అనుమానాలు పెంచుకుని చిత్ర హింసలకు గురి చేసేవాడని అన్నారు. విసిగి పోయిన వెంకటలక్ష్మి ఆత్మహత్య చేసుకుందని భార్య తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.