అనంతపురం నగరంలోని నీరుగంటివీధికి చెందిన గౌసియా అనే మహిళ జీవితంపై విరక్తి చెంది.. ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త మహమ్మద్ అలీ తాగుడుకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉంటున్నాడని పలుమార్లు అతనితో వాదనకు దిగినట్లు స్థానికులు తెలిపారు.
భర్త తీరుతో విసిగి.. భార్య ఆత్మహత్య - ఆత్మహత్య చేసుకున్న మహిళ
అనంతపురంలో గౌసియా అనే మహిళ ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్తతో ఉన్న కలహాలే ఇందుకు కారణమని పోలీసులు చెబుతున్నారు.
భర్త తీరుతో విసిగి.. భార్య ఆత్మహత్య
భర్తలో మార్పు రాదని గ్రహించిన ఆమె.. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు ఒకటో పట్టణ పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.