అనంతపురం జిల్లా కదిరి మండలం కౌలేపల్లి సమీపంలోని దేవరచెరువులో అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళ కాళ్లపై తీవ్ర గాయాలు ఉన్నందున చెరువు కట్ట పైనుంచి ప్రమాదవశాత్తు పడిందా.. లేక ఎవరైనా హత్య చేశారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. దర్యాప్తులో మహిళ వివరాలతో పాటు మృతికి సంబంధించిన పూర్తి సమాచారం తేలుతుందని కదిరి గ్రామీణ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.