అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం మంగళ మడక గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పెద్ద శబ్దంతో పేలింది. నివాసాల మధ్య ఉన్న ట్రాన్స్ఫార్మర్ పేలడంతో విద్యుదాఘాతానికి గురై.. ప్రమీలమ్మ అనే మహిళ మృతి చెందింది. ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలడం వల్ల.. జనాలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో గ్రామంలోని విద్యుత్ ఉపకరణాలు సైతం కాలిపోయాయి. అధిక ఓల్టేజితోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ట్రాన్స్ఫార్మర్ పేలి మహిళ మృతి..విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే కారణమని ఆరోపణ - అనంతపురం జిల్లాలో విద్యుదాఘాతంలో మహిళ మృతి
అనంతపురం జిల్లా మంగళమడక గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ పేలింది. ట్రాన్స్ఫార్మర్ పేలడంతో విద్యుదాఘాతానికి గురై.. గ్రామానికి చెందిన మహిళ మృతి చెందింది. ట్రాన్స్ఫార్మర్ పేలటంతో గ్రామస్థులు భయాందోళనకు గురై.. పరుగులు తీశారు. అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని ఆరోపించారు.
విద్యుదాఘాతం
అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని గ్రామస్థులంటున్నారు. విద్యుత్ శాఖ అధికారులు గ్రామాన్ని సందర్శించి జరిగిన ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి