అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని ప్రత్యేక అధికారి బాబూరావు నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక ఆర్డీఓ, ఆరోగ్య శాఖ అధికారులను ద్వారా ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం, శెట్టూరు, కుందుర్పి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది.. ఈ కేంద్రాల నిర్వహణ అధ్వాన్నంగా ఉందని.. తమకు మాస్కులూ సరఫరా చేయడం లేదని ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన అధికారి ప్రభుత్వంతో చర్చించి సమస్యను తీరుస్తానని హామీ ఇచ్చారు.
కళ్యాణదుర్గం క్వారంటైన్ కేంద్రం ఆకస్మిక తనిఖీ - quarantine
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం క్వారంటైన్ కేంద్రాన్ని ప్రత్యేక అధికారి ఆకస్మికంగా సందర్శించారు. కేంద్రంలోని ఏర్పాట్లపై స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కళ్యాణదుర్గం క్వారంటైన్ కేంద్రం ఆకస్మిక తనిఖీ