అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లె గ్రామానికి చెందిన అన్నదమ్ములు స్వామిరంగారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి. నాన్న పంచి ఇచ్చిన 12 ఎకరాల్లో..ముగ్గురన్నదమ్ములూ 1995లో ఉమ్మడి వ్యవసాయం (joint farming in venkatareddypalli) ప్రారంభించారు. రాజశేఖర్‌రెడ్డి చదువుకున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. బడివేళలు ముగియగానే వ్యవసాయ క్షేత్రానికి వెళ్తారు. తన సోదరులకు ఆధునిక పరిజ్ఞానం అందిస్తారు(brothers success in joint farming in Anantapur district). దిగుబడి మొదలు ఉత్పత్తిని మార్కెట్‌లో విక్రయించే దాకా ముగ్గురూ కలిసి.. అన్నీ ప్రణాళికాబద్ధంగా చేస్తారు. దానిమ్మ, ద్రాక్ష, మునగ, బత్తాయి సాగు చేస్తూ ఏటా రూ.2.5 కోట్ల ఆదాయం పొందుతున్నారు. కుటుంబ ఖర్చులు పోగా, మిగిలిన సొమ్ముతో సాగు భూములు కొనుగోలు చేస్తున్నారు. మంచి లాభాలు ఆర్జిస్తూ ఉన్న 12 ఏకరాల పొలాన్ని 120 ఎకరాలకు పెంచారు(three brothers success in joint farming). పంటలు నష్టపోకుండా తోటి అన్నదాతలకు సలహాలిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు...
ప్రతి నీటి బొట్టూ బంగారంతో సమానమని..
ప్రతి నీటి బొట్టూ బంగారంతో సమానమని గుర్తెరిగారు ఈ అన్నదమ్ములు. తమ వ్యవసాయ క్షేత్రంలో ఆరు ఎకరాల్లో 12 కోట్ల లీటర్ల సామర్థ్యంతో నీటి కుంటను ఏర్పాటు చేశారు. ఏడు కిలోమీటర్ల దూరంలోని పెన్నానది నుంచి ప్రత్యేకంగా పైపులైను వేసి, కుంటను నిత్యం నిండుకుండలా ఉంచుతున్నారు. దీనికి అనుబంధంగా వ్యవసాయ క్షేత్రంలో అరెకరా విస్తీర్ణం చొప్పున మరో రెండు చోట్ల 50 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేసి డ్రిప్ పైపుల ద్వారా మొక్కలకు అందిస్తున్నారు.
మేము ముగ్గురం కలిసి ఉమ్మడి వ్యవసాయం చేస్తున్నాం. నేను వృత్తిరీత్య ఉపాధ్యాయుడిని. స్కూల్ సమయం ముగిసిన వెంటనే వ్యవసాయక్షేత్రానికి వెళ్లి తోటలను పర్యవేక్షిస్తుంటాను. ఈ రంగంలో వస్తున్న నూతన సాంకేతికను ఉపయోగిస్తూ..ముందుకు సాగుతున్నాం. ప్రస్తుతం 120 ఏకరాల్లో విజయవంతగా పంటలు సాగుచేస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా దానిమ్మ, ద్రాక్ష, మునగ పండిస్తున్నాం. ఏ మార్కెట్‌లో మంచి ధర ఉంటే అక్కడికి తీసుకెళ్లి అమ్ముతాం. మేము ముగ్గురం పట్టుదలతో సాగు చేస్తున్నాం. మంచి లాభాలు వస్తున్నాయి. 12 ఎకరాల్లో ప్రారంభించి ఇప్పడు 120 ఎకరాల్లో సాగు చేస్తున్నాం. ఏడాదికి సమారుగా రూ. 2.50 కోట్ల ఆదాయం పొందుతున్నాం.- రైతులు