అనంతపురం జిల్లా గార్లదిన్నె మండల కేంద్రంలో వేగంగా వస్తున్న లారీ.. ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పెడ్డవడుగూరు మండలం మిడుతురు గ్రామానికి చెందిన... యువతేజ అనే విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందగా... ఆమె తండ్రి గాయాలపాలయ్యారు. కుమార్తె మరణంతో ఆ తండ్రి కన్నీరుమున్నీరు అయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కళ్ల ముందు కుమార్తె మరణం... తండ్రికి తీరని శోకం - అనంతపురం రోడ్డు ప్రమాదాలు
కళ్ల ముందు కుమార్తె మరణం ఓ తండ్రికి తీరని వేదన మిగిల్చింది. జాగ్రత్తగా.. ద్విచక్ర వాహనం ఎక్కించుకొని.. ఆమెతో కబుర్లు చెబుతూ ప్రయాణం చేస్తున్నాడు ఆ తండ్రి. కానీ.. మృత్యువు వెనక నుంచి తన చిట్టి తల్లిని కబళించబోతోందని పాపం ఆ క్షణం అతనికి తెలియలేదు. ఒక్కసారిగా వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ.. వారు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపు ఆ తండ్రికి వీడ్కోలు పలికి అనంతలోకాన్ని చేరింది ఆ బాలిక.
కళ్ల ముందు కూతురి మరణం