పెళ్లి పత్రికలు పంచేందుకు బైక్‌పై వెళుతుండగా.. ఎదురుగా వస్తున్న.. ద్విచక్రవాహనం ఢీకొని ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతపురం జిల్లా కదిరి మండలం ఎరుకులవాండ్లపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కదిరి మండలం ఎర్రదొడ్డికి చెందిన మహేశ్ (26) మృతి చెందాడు. మహేశ్‌కు ఈ నెల 27న వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి పత్రికలు పంచేందుకు బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Accident: కొద్ది రోజుల్లో కల్యాణం.. అంతలోనే వరుడు మృతి! - Road accident at Erukulavandlapalli
మరో నాలుగు రోజుల్లో పెళ్లి. వివాహ వేడుకలు మెుదలయ్యాయి. ఇంకా పత్రికలు పంచాల్సి ఉంది. వాటి కోసం వరుడు పయనమయ్యాడు. కానీ.. అదే అతని చివరి ప్రయాణం అవుతుందని ఊహించలేకపోయాడు. బైక్ పై వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొనటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదం
Last Updated : Aug 23, 2021, 8:54 AM IST