అనంతపురం జిల్లా కడవకల్లులోని ఓ అనాథ బాలుడికి రిటైర్డ్ ఉద్యోగి దంపతులు ఆర్థికసాయం చేశారు. గ్రామానికి చెందిన బాలుడు రాజు తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం మరణించడంతో .... ఇప్పటిదాకా తనని అవ్వే పెంచింది. ఆమె కుడా హఠాత్తుగా చనిపోవడంతో.. రాజు అనాథగా మిగిలిపోయాడు. బాలుడు పరిస్థితి గురించి పలు పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. విషయం తెలుసుకున్న అనంతపురం నగరానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి, ఆయన సతీమణి విజయలక్ష్మి దంపతులు కడవకల్లు గ్రామానికి చేరుకుని రాజుకి ఆర్థికసాయం చేశారు. భవిష్యత్‌లో అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
కడవకల్లులో ఔదార్యం చాటిన రిటైర్డ్ ఉద్యోగి దంపతులు - orphan boy at kadavakallu
అనంతపురం జిల్లా కడవకల్లులోని ఓ అనాథ బాలుడికి రిటైర్డ్ ఉద్యోగి దంపతులు ఆర్థికసాయం చేశారు. భవిష్యత్‌లోనూ సహాయం అందిస్తామని ఆ బాలుడికి హమీ ఇచ్చారు.

కడవకల్లులో ఔదార్యం చాటిన రిటైర్డ్ ఉద్యోగి దంపతులు