ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుత్తి సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ మృతి - రిమాండ్

అనంతపురం జిల్లాలో రిమాండ్ ఖైదీ మృతి చెందాడు. గుత్తి సబ్​జైల్లో ఉన్నప్పుడు అతనికి ఛాతీ నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే చనిపోయాడు.

death
death

By

Published : Aug 24, 2021, 5:08 PM IST

Updated : Aug 25, 2021, 7:42 AM IST

రిమాండ్​లో ఉన్న ఖైదీ అకస్మాత్తుగా మృతి చెందాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తిలో సంచలనం రేపింది. ఓబులయ్య అనే ఖైదీకి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మృతి చెందాడని గుత్తి సబ్ జైల్ సూపరింటెండెంట్​ రమేష్ తెలిపారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం.

గుత్తి సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ మృతి

అనారోగ్యంతోనే..

వజ్రకరూరు మండలానికి చెందిన తలారి ఓబులప్ప (67) ఈనెల 21వ తేదీన ఎక్సైజ్ కేసులో అరెస్టయ్యాడు. గుత్తి సబ్ జైలులో రిమాండులో ఉన్నాడు. అయితే సోమవారం సాయంత్రం అతనికి ఛాతీలో విపరీతంగా నొప్పి రావడంతో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు. -సబ్ జైల్ సూపరింటెండెంట్​ రమేష్

ఇదీ చదవండి:గుప్తనిధుల కోసం తవ్వకాలు.. పోలీసుల అదుపులో 8 మంది నిందితులు

Last Updated : Aug 25, 2021, 7:42 AM IST

ABOUT THE AUTHOR

...view details