ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రమాదవశాత్తు నదిలో పడి రియల్ ఎస్టేట్ వ్యాపారి మృతి - real estate dealer died in chitravati river in puttaparti news

ప్రమాదవశాత్తు చిత్రావతి నదిలో పడిపోయి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి మరణించిన ఘటన పుట్టపర్తిలో జరిగింది. మృతుడి మరణంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది

మృతుడి వద్ద రోదిస్తున్న కుటుంబీకులు

By

Published : Nov 9, 2019, 4:30 PM IST

ప్రమాదవశాత్తు నదిలో పడి రియల్ ఎస్టేట్ వ్యాపారి మృతి

అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రమాదవశాత్తు చిత్రావతి నదిలో పడి చనిపోయాడు. పుట్టపర్తిలోని గోకులం వీధికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గంగాద్రి నిన్న సాయంత్రం ద్విచక్రవాహనంపై బయటకు వెళ్లి... రాత్రివరకు ఇంటికి తిరిగి రాలేదు. చిత్రావతి నది సమీపంలోని దుర్గాదేవి ఆలయం వద్ద ద్విచక్రవాహనం కనిపించింది. నదిలో చూడగా.. గంగాద్రి మృతదేహం కనిపించింది. ప్రమాదవశాత్తు మృతుడు నదిలోపడి చనిపోయినట్లు తెలుస్తోంది. పుట్టపర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details